ఎంత గొప్ప ఫిలిం మేకర్ అయినా కానీ ఏదో ఒక తప్పు చేస్తాడు. దర్శకులు చేసే కొన్ని మిస్టేక్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అబ్బా అనిపిస్తాయి.ఈ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా మినహాయింపు  ఏమి కాదు.


 ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఆయన చేసిన ఒక్కొక్క మిస్టేక్ కూడా బయటికి వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ఓటీటీలోకి అందుబాటులోకి రాగా ప్రేక్షకులు ఫ్రేమ్ టు ఫ్రేమ్ నిశితంగా పరిశీలిస్తున్నారట.ఈ క్రమంలో రాజమౌళి చేసిన మిస్టేక్స్, లాజిక్ లెస్ సీన్స్ తెరపైకి వస్తున్నాయిట.. సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ రెండు రకాల నంబర్ ప్లేట్స్ ను కలిగి ఉంది. ఒక బైక్ కి రెండు భిన్నమైన నంబర్స్ ఏంటని చర్చ కూడా నడిచింది.


 


తాజాగా ఆర్ ఆర్ ఆర్ లోని మరో మిస్టేక్  కూడా పట్టేశారు నెటిజెన్స్. ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని అద్భుతమైన సన్నివేశాల్లో ఇంటర్వెల్ సీన్ ఒకటి. తనకంటూ దళం లేని ఎన్టీఆర్(NTR).. అడవి మృగాలను తన సైన్యంగా చేసుకుంటాడు. అడవిలో పట్టుకొచ్చిన కొన్ని క్రూర మృగాలను వాహనంలో తీసుకొచ్చి బ్రిటీష్ వారి కోటపై దాడి చేస్తాడు.


 

నిప్పు కాగడాలు పట్టుకొని అడవి మృగాలతో పాటు ఎన్టీఆర్ వాహనం నుండి దూకే సన్నివేశానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సన్నివేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసిన కొందరు ప్రేక్షకులు... ఓ మిస్టేక్ అయితే ఉందంటున్నారు. ఓకె బోనులో పులులు జింకలు ఎలా ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు. తమ బోనులో జింకలు ఉంటే పులులు తినలేదా జక్కన్నా? అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.


 


దీనిపై కొన్ని కామెడీ మీమ్స్, ట్రోల్స్ కూడా రూపొందిస్తున్నారు. పులికి చీకట్లో కళ్ళు కనబడలేదు అని ఒకరంటే.. అవి ఫ్రెండ్స్ అందుకే దాడి చేయలేదని మరొకరు సెటైర్ కూడా వేస్తున్నారు .

 

అయితే రాజమౌళి(Rajamouli)ని సమర్థించే వారు మాత్రం... జంగిల్ బుక్ మూవీలో జంతువులన్నీ కలిసి పాటలు పడుకుంటే నమ్మారు, కానీ ఆర్ ఆర్ ఆర్ లో పులి జింక ఒక బోనులో ఉన్నాయంటే నమ్మరా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారట.


 

సినిమాటిక్ ఫ్రీడమ్ అనేది ఒకటి ఉండగా ఇవన్నీ కూడా కామన్. అక్కడ ఎమోషన్ ముఖ్యం లాజిక్ కాదంటున్నారు . ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచడం కోసం దర్శకులు ఇలాంటి మ్యాజిక్స్ ను ట్రై చేస్తారు. దాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎన్టీఆర్ జంతువులతో పాటు మెరుపు దాడి చేయడం ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది.


 

ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని యూఎస్ లో జూన్ 1న మరోసారి విడుదల చేస్తున్నారట.ఎంపిక చేసిన 100 స్క్రీన్స్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించనున్నారట . సెకండ్ విడుదలకు కూడా ఈ చిత్రానికి భారీగా రెస్పాన్స్ దక్కడం గమనార్హం. ఈసారి ఆర్ ఆర్ ఆర్ అన్ కట్ వెర్షన్ కూడా విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: