నందమూరి తారకరామారావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగు పెట్టినప్పటికీ నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఇంటి పేరును ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలబెడుతున్నారు.


ఇలా ఈ హీరోలిద్దరూ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్థలు ఏర్పడ్డాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో మాత్రం నిజం లేదు అంటూ ఎప్పటికప్పుడు కొట్టిపారేసిన వీరి వ్యవహార శైలి మాత్రం వీరిద్దరి మధ్య ఏదో మనస్పర్థలు ఉన్నాయని మాత్రం చెబుతోంది.


బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ కుమారుడిగా ఎన్టీఆర్ పేరుపొందారు అయితే హరికృష్ణ మరణించిన తర్వాత కూడా ఎన్టీఆర్ బాలకృష్ణకు దగ్గర కాలేకపోయారట.. ఇకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని తాజాగా మరొక విషయం ద్వారా బయట పడింది. జూన్ 10వ తేదీ బాలకృష్ణ ఎంతో ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు పెద్దఎత్తున ఘనంగా జరపడమే కాకుండా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తునే శుభాకాంక్షలు తెలిపారు.


ఇక బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకోవడంతో ఎన్టీఆర్ కనీసం తన బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియ చేయకపోవటంతో పలు విమర్శలు అయితే ఎదురవుతున్నాయి.


ఈ క్రమంలోనే బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ బాబాయ్ అంటే కనీస గౌరవ మర్యాదలు కూడా లేకపోతే ఎలా?కనీసం పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేయాలి కదా ఆ మాత్రం తీరిక లేకుండా ఎన్టీఆర్ గడుపుతున్నారా? అంటూ పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ తీరు పై కామెంట్లు చేస్తున్నారట.. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ చేయకపోయినా వ్యక్తిగతంగా తనకు శుభాకాంక్షలు చెప్పి ఉంటారు అంటూ ఎన్టీఆర్ కు మద్దతు తెలుపుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: