సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్క బోయే సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించబోతోంది .

మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూర్చ బోతున్నాడు .  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూలై సెకండ్ వీక్ నుంచి ప్రారంభించడానికి మేకర్స్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమా షూటింగ్ ను యాక్షన్ సన్నివేశాలతో మొదలు పెట్ట బోతున్నట్లు సమాచారం . ఇది ఇలా ఉంటే ఈ యాక్షన్ సన్నివేశాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కొరియో గ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది .  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . ఈ మూవీ పిరియాడిక్ డ్రామా గా తెరకెక్కబోతుంది అని , లివ్  మరియు ఫ్లాష్ బ్యాక్ ఈ మూవీ లో సమానంగా సాగబోతున్నాయి అని , మరీ ముఖ్యంగా ఈ మూవీ లో సెకండాఫ్ లో వచ్చే మహేష్ బాబు రెండవ క్యారెక్టర్ కు సంబంధించిన సన్నివేశాలు ఈ మూవీ కే హైలెట్ గా నిలవనునట్లు తెలుస్తోంది .

మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్క బోతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి .  ఈ సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: