నిఖిల్ కెరియర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిన చిత్రం కార్తీకేయ.. సస్పెన్స్ కథ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టున్న సినిమా..మంచి హిట్ టాక్ ను అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ కథనాయకుడిగా వచ్చిన సినిమా కార్తికేయ. ఈ సినిమా ఊహించని బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది..అ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం గ్రేట్ అనే చెప్పాలి..


ఈ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వర్‌ జంటగా కార్తికేయ-2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండగా మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ”కార్తికేయ 2” ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.


లేటెస్టుగా విడుదలైన ‘కార్తికేయ 2’ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక మిస్టీరియస్ థ్రిల్లింగ్ ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు హామీ ఇచ్చింది. ‘ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం అక్కడ మళ్లీ మొదలయింది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు’ అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మీనన్‌, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్‌ పలు పాత్రలను పోషిస్తున్నారు. నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. జూలై 22న ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: