ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులందరినీ  కడుపుబ్బా నవ్విస్తున్న కార్యక్రమం జబర్దస్త్. ఒక సాదాసీదా కామెడీ షోగా గా ప్రారంభమైన జబర్దస్త్ ప్రస్తుతం కోట్లాది మంది బుల్లి తెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ టాప్ కామెడీ షోగా కొన సాగుతుంది. అయితే ఇటీవలి కాలం లో జబర్దస్త్ కార్యక్రమం లో కమెడియన్స్ అందరు కూడా అటు ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదిస్తూ సినిమా ల్లో కూడా అవకాశాలు దక్కించు కున్నారు. అయితే ఇలా జబర్దస్త్ ద్వారా  బాగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో వర్ష కూడా ఒకరు అనే విషయం తెలిసిందే.


 జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్  తో లవ్ ట్రాక్ కారణం గా జబర్దస్త్ వర్షకి ఒక్క సారిగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ లో ఎంతో మంది స్కిట్ లలో భాగం అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఇక జబర్దస్త్ వర్ష, ఇమ్మానియేల్  జోడిని బుల్లితెర ప్రేక్షకులను బ్లాక్ అండ్ వైట్ జోడిగా పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎప్పటి లాగానే ఇక జబర్దస్త్ కార్యక్రమాని కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.


 జబర్దస్త్ ప్రోమో చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయారు. కారణం మొన్నటి వరకు ఎంతో అందం గా కనిపించినా జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గుండు కొట్టించు కొని కనిపించింది. దీంతో ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. ఇక వర్ష ఏంటి  కొట్టించు కోవడం ఏంటి.. ఎందుకు ఇలా చేసిందో అని ఆలోచన లో పడి పోయారు. కానీ ఆ తర్వాత మాత్రం అది నిజమైన గుండు కాదని కేవలం అలా సెట్ చేశారని తెలిసి ఇక వర్షా అభిమానులు అందరూ కూడా ఊపిరి పీల్చు కున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: