ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ షో నిర్వాహకులకు డబ్బులు తెచ్చి పెట్టడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి పేరుప్రఖ్యాతులు కూడా తెచ్చిపెట్టింది. జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఎంతో మంది ఆటగాళ్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి మరో కార్యక్రమంలో కామెడీ చేస్తున్న.. జబర్దస్త్ ఇచ్చిన గుర్తింపు మాత్రం ఎప్పటికీ మరిచిపోరు అని చెప్పాలి. ఈ షో మొదలైన నాటి నుంచి జడ్జిగా కొనసాగుతున్న నాగబాబు ఈ షో విజయవంతం అవడానికి కీలక పాత్ర వహించారు.


 నాగబాబు నవ్వుతోనే జబర్దస్త్ కి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక నాగబాబు జబర్దస్త్ జడ్జ్ గా తప్పుకున్న తర్వాత ప్రస్తుతం స్టార్ మా లో జడ్జిగా కొనసాగుతున్నారు. అయితే ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ సైతం ఇక్కడ కామెడీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక జబర్దస్త్ మాజీ కమెడియన్ మెగా బ్రదర్ నాగబాబు కి షాక్ ఇచ్చాడు. ఇటీవలే పార్టీ చీర్స్ అనే కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఈ ప్రోమోలో భాగంగా కిరాక్ ఆర్ పి ఒక డాన్స్ పర్ఫామెన్స్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఆర్పి ఎవరినైనా ప్రేమిస్తే  ఎంతలా ప్రేమిస్తాడు అంటే నాగబాబు గారి పేరు గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అని సుధీర్ చెప్పడంతో నాగబాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అవునా నిజమా నాకు ఎప్పుడూ చెప్పలేదు..  అంటూ ఇక కిరాక్ ఆర్పి నీ దగ్గరికి పిలుచుకొని గుండెపై వేసుకున్న పచ్చబొట్టు చూసి ఎంతో ప్రేమగా అతని ఆలింగనం చేసుకున్నాడు. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: