నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను కూడా ముగిసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ మూవీ కి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ని కూడా మూవీ యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2 గంటల 26 నిమిషాల 30 సెకన్ ల నిదివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా,  వీటికి ప్రేక్షకుల నుండి అదిరి పోయే రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ మూవీ పై ఉన్న అంచనాలని కూడా మరింతగా పెంచాయి.  

మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లలో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ తో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: