టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో చాలా దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ఈయన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇక మహేష్ కెరీర్ లో 28 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సిందిగా కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఈయన సినిమా ఆలస్యం కావడంతో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఫారెన్ వెకేషన్ వెళ్లారు.


ఇలా విదేశాలలో తన కుటుంబంతో కలిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసిన మహేష్ బాబు తిరిగి ఇండియా తిరిగి వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఇలా ఈయన ఇండియాకి తిరిగి రావడంతో హైదరాబాదులో ఎయిర్ పోర్టులో తీసిన వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత పిల్లల కూడా కెమెరా కంటికి చిక్కడంతో మీడియా వీరి ఫోటోలను క్లిక్ మనిపించారు. ఇక హాలిడే వెకేషన్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా షూటింగులతో ఫుల్ గా బిజీ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇలా ఈయన త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొని శరవేగంగా తన షూటింగ్ పనులను ప్రారంభించి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో బిజీ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక చూడాలి ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: