150 సినిమాలలో నటించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న చిరంజీవి నేటితరం ప్రేక్షకుల ట్రెండ్ ను గ్రహించలేకపోతున్నాడా అన్న కామెంట్స్ వస్తున్నాయి. సినిమాల నుండి రాజకీయాలలోకి వెళ్ళి 9 సంవత్సరాల తరువాత తిరిగి సినిమాలలోకి ‘ఖైదీ నెంబర్ 150 మూవీతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిరంజీవిని ఈతరం ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నభయం అప్పట్లో చాలామందికి ఉంది.


అయితే ‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ సక్సస్ తో తిరిగి తన నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్న చిరంజీవి ఆతరువాత నటించిన ‘సైరా’ తో పెద్దగా మెప్పించలేకపోయాడు. దీనితో అనేక ఆలోచనలు చేసి చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో రామ్ చరణ్ తో కలిసి నటించినప్పటికీ ఆమూవీని మెగా అభిమానులు కూడ పట్టించుకాకపోవడం ఏకంగా చిరంజీవికే షాక్ ఇచ్చింది అంటారు.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా స్వతహాగా మొహమాటస్తుడైన చిరంజీవి కొంత మొహమాటానికి లోబడి ‘పక్కా కమర్షియల్’ ‘మిషన్ ఇంపాజబుల్’ సినిమాలను ప్రమోట్ చేస్తే కనీసం మెగా అభిమానులు కూడ పట్టించుకోలేదు. గత సంవత్సరం ‘మా’ సంస్థకు జరిగిన ఎన్నికలలో మెగా కాంపౌండ్ ప్రకాష్ రాజ్ కు మద్దతు పలికినప్పటికీ చిరంజీవి అభిప్రాయాన్ని మా సంస్థ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.


ఇప్పుడు అమీర్ ఖాన్ తో తనకు ఉన్న స్నేహం రీత్యా చిరంజీవి ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ తెలుగు వెర్షన్ ను చిరంజీవి సమర్పించినప్పటికీ ఆమూవీని మెగా అభిమానులు పట్టించుకోవడం లేదు. ఇక వచ్చేనెల విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి చిరంజీవి మళ్ళీ మొహమాటంతో వాయస్ ఓవర్ చెప్పాడు. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి కూడ ఎలా ఉంటుంది అన్న భయం కొదరికి ఉంది దీనికితోడు బాలీవుడ్ భారీ సినిమాలు అన్నీ వరసపెట్టి ఇలా ఫ్లాప్ లుగా మారుతున్న పరిస్థితులలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పై కూడ కొందరికి సందేహాలు ఉన్నాయి. ఇలా చిరంజీవి జడ్జిమెంట్ గురి తప్పుతోందా అంటూ కొందరి కామెంట్స్ వినిపిస్తున్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: