అయితే వడ్డే నవీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది అందరికీ తెలుసు. కానీ వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతారు అని చెప్పాలి. వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడు. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి నే వడ్డే నవీన్ వివాహం చేసుకున్నాడు. నవీన్ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు.. నందమూరి తారక రామారావు కుమారుడు అయినా రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరీనీ పెళ్లి చేసుకున్నాడు. నందమూరి బ్యాగ్రౌండ్ గురించి ఎవరికీ తెలియనిది కాదు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాఫీగా సాగిపోతుంది.
ఇకపోతే ఆయన కెరీర్ విషయానికి వస్తే.. అప్పట్లో హీరోగా నటించి ఎంతగానో అలరించిన వడ్డే నవీన్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడేమో అని అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతో మంది సీనియర్ నటులు తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ వరుస అవకాశాలతో బిజీ బిజీ గా మారుతూ.. బాగా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వడ్డే నవీన్ కూడా ఇలాగే రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఎంతో మంది కోరుకుంటున్నారు.. కానీ వడ్డే నవీన్ మాత్రం ఇటు సినిమాలకు అటు సోషల్ మీడియా కి దూరంగానే ఉంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి