ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం నుంచి సినిమా రాబోతుండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి దాదాపుగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్ పనులలో చాలా వేగవంతం చేసింది.

ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలలో ఈవెంట్లను చేస్తూ ఉంది చిత్ర బృందం. అయితే తాజాగా హైదరాబాద్ లో ప్రమోషన్స్ ని ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం ఇందులో హీరో కార్తీ పొన్నియన్ సెల్వన్ చిత్రంపై వస్తున్న పలు పుకార్లకు సైతం చెక్ పెట్టారని చెప్పవచ్చు. చారిత్రాక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బాహుబలి సినిమాతో పోల్చుతున్నారని చిత్ర యూనిట్స్ సైతం ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయని దీంతో ఈ విషయంపై కార్తి స్పందించడం జరిగింది. కార్తీ మాట్లాడుతూ బాహుబలి సినిమాని ఇదివరకు చూశారు కాబట్టి అందరూ ఎక్కువగా ఆ సినిమాతోనే పోలుస్తున్నారు.

అయితే పొన్నియన్ సెల్వన్ చిత్రం 70 ఏళ్ల నవల రూపంలో ఉన్న ఒక కథను డైరెక్టర్ మణిరత్నం గారు దాన్ని తీర్చిదిద్ది పొన్నియన్ సెల్వన్ గా తెరకెక్కించారని తెలియజేశారు .ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇలాంటివి చేయడం మంచిది కాదని కూడా తెలియజేశారు.ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడి పని చేశామని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకున్నారు కార్తీ. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: