సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తన హవా నడిపించిన కృష్ణంరాజు మొన్నటి వరకు కూడా ప్రేక్షకులను ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా ఆయన ప్రేక్షకులకు దూరమయ్యారు. భౌతికంగా దూరమైన ఆయన సినిమాల ద్వారా ఇంకా ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు అని చెప్పాలి. ఆయన చనిపోయిన తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తూ ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి.


 అయితే చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి రానించాలని భావించారు కృష్ణంరాజు. ఇక ఇదే విషయాన్ని తండ్రికి చెప్పడంతో చివరికి చెన్నైకి పంపించారు. అయితే అప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారట కృష్ణంరాజు. తర్వాత కాలంలో  మాత్రం తనలో ఉన్న నటుడిని బయటపెట్టి ఇక స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే విలన్ పాత్రలు చేసే అవకాశం వచ్చినప్పటికీ కృష్ణంరాజు మాత్రం ఇక నో చెప్పేసారట. ఇక పెద్ద జమీందారు కుటుంబం అయినప్పటికీ కొన్నిసార్లు తిండి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చిందట.


 వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజంగానే కృష్ణంరాజు ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారట. అయితే ఆ సమయంలోనే చెన్నైకి వచ్చిన కృష్ణంరాజు స్నేహితుడు కృష్ణంరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడట.  ఏమైంది ఇలా అయిపోయావు అంటూ అడిగితే.. మొహమాటం కొద్దీ స్నేహితుడికి కూడా తన కష్టాలు చెప్పుకోలేదట. కానీ స్నేహితుడు పరిస్థితి అర్థం చేసుకొని చివరికి కృష్ణంరాజుకు కడుపునిండా భోజనం పెట్టించడమే కాదు తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇచ్చాడట. కొన్నాళ్లకు  ఈ విషయం కృష్ణంరాజు తండ్రికి తెలిసి ఇక ఎంతగానో బాధపడ్డారట. ఇక అప్పటినుండి  వారానికి 300 రూపాయలు కృష్ణంరాజుకి మనీ ఆర్డర్ చేస్తూ ఉండేవారట ఆయన తండ్రి. ఇలా ఆయనకున్న మొహమాటం కారణంగా ఇండస్ట్రీకి రాకముందే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని కష్టాలు పడ్డారట కృష్ణంరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: