టాలీవుడ్ బుల్లితెర యాంకర్లుగా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో గ్లామరస్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు యాంకర్ వర్షిని.


బుల్లితెర పై ప్రసారమైన ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన వర్షిని ఒకవైపు బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు వెండితెర సినిమాలలో కూడా ఆమె నటించారు. ఈ విధంగా ఈమె వెండితెరపై పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా అదృష్టం అయితే కలిసి రాలేదని చెప్పాలి.


ఇలా వెండితెరపై ఏమాత్రం గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వర్షిని బుల్లితెరపై కూడా కనిపించడం లేదు. అయితే వర్షిని వెండితెరపై బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకునేవారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఎంత షో చేసినా తనకు అవకాశాలు రాకపోవడంతో వర్షిని షాకింగ్ డిసిషన్ తీసుకున్నారట.


 


ఇలా తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో తాను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని ఈమె భావించారట. ఈ క్రమంలోనే వర్షిని వరుసకు బావయే వ్యక్తితో వివాహం చేసుకోబోతుందని చిన్నప్పటి నుంచి వీరి తల్లిదండ్రులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్షిని తన బావతో కలిసి ఏడు అడుగులు నడవబోతున్నట్లు సమాచారం. ఇక వర్షిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా బాగా సంపన్నులని ఈయనకు కోట్లలో ఆస్తిపాస్తులు అయితే ఉన్నాయని తెలుస్తుంది.


 


అయితే వీరి పెళ్లి ఎప్పుడో జరగాల్సి ఉండగా వర్షిని మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీరు పెళ్లి వాయిదా పడుతూ వచ్చిందని అయితే త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వెలబడునుంది అంటూ పెద్ద ఎత్తున వర్షిని పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈమె పెళ్లి వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: