బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ దక్కిందో మనకు బాగా తెలిసిందే.


ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.బాలకృష్ణ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో ఎంతోమంది బాలకృష్ణ ఏంటి యాంకర్ ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ అందరూ ఆశ్చర్యపోయే విధంగా తన వాక్చాతుర్యంతో ఎంతోమంది సెలబ్రిటీలను ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆయన సందడి చేశారు.


ఇలా మొదటి సీజన్ ఎంతో మంచి విజయం అందుకోవడంతో సీజన్ 2 కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ స్టాపబుల్ యాంథమ్ విడుదల అయ్యే ప్రేక్షకులనుఎంతో సందడి చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడమే కాకుండా ఈ కార్యక్రమం ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.


 


ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 4వ తేదీ విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు కూడా ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ ద్వారా ఎంతగానో సందడి చేసిన బాలయ్య ఈసారి ఈ కార్యక్రమంలో మొదటిసారిగా ఎవరిని ప్రశ్నించనున్నారనే విషయం పై అందరిలో కూడా ఆత్రుత నెలకొంది.


 


ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈసారి బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కార్యక్రమానికి అతిథిగా రాబోతున్నట్లు సమాచారం అయితే మొదటి గెస్ట్ గా ఈ కార్యక్రమాని కి ఎవరు హాజరు కానున్నారో  మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: