
సీమంతం చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అని నాగ్ అడగ్గానే చాలా బాగుందంటూ రేవంత్ సమాదానం ఇచ్చాడు. మరి నువ్వు ఎప్పుడు చేయించుకుంటున్నావు సీమంతం అని నాగార్జున చిలిపిగా అడుగుతారు. గీతూను దృష్టిలో పెట్టుకొని నాగార్జున ఈ ప్రశ్న వేశారు. వెంటనే గీతు అందుకుంది. ఆ రోజే చెప్పినాను సార్.. కూర్చో నీకు కూడా దీవెన ఇస్తామని చెప్పినాను సార్.. ఎందుకంటే ఈయన కూడా ప్రెగ్నెంటే. ఈయన భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈయన కూడా ప్రెగ్నెంట్ అంటూ గీతూ అంటుంది. గీతూకు సపోర్ట్ చేస్తూ బాలాదిత్య కూడా తన వాదన వినిపించాడు. సీమంతం అనేది లైఫ్ టైం మెమొరీ సార్.. మగాడు ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేడు.
ఒకవేళ ప్రెగ్నెంట్ అంటే బేబీ రావడానికి తల్లి ఎలా ఎంజాయ్ చేస్తుందో తండ్రి కూడా అలానే ఎంజాయ్ చేస్తాడనే కాన్సెప్ట్ తప్ప, అన్నింటికి లిటరల్ మీనింగ్ తీసుకోలేం సార్. ఆ ఎమోషనల్ యాంగిల్ లో తప్ప ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ యాంగిల్ అని నా ఒపీనియన్ సార్.. అంటూ బాలాదిత్య మాట్లాడుతుంటే మధ్యలో నాగార్జున దూరి ఏంటి ఇప్పుడు సీమంతం చేద్దాం అంటావా అని అడిగారు నా ఉద్దేశం అది అస్సలు కాదంటూ తప్పించుకున్నాడు. కంటెస్టెంట్స్ తో డిస్కస్ నాగార్జున ఆశీస్సులు దీవెనలు ఇవ్వడానికి సీమంతం చేస్తారు కాబట్టి రేవంత్ కూడా చేయవచ్చని డిసైడ్ చేశారు. రేవంత్ కి శ్రీమంతం అని నాగార్జున ఒక మెసేజ్ పాస్ చేశారు.