ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో రష్మిక మందన్న పేరు ఎంత లా వినిపిస్తుందో మనందరికీ కూడా తెలుసు. ఈమె కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేస్తోంది.
ఇక బాలీవుడ్ లో ఈమె కు చాలా మంది హీరోలు కూడా ఫిదా అయిపోయారు. ఇక రష్మిక ఏమాత్రం వెనకడుగు వేయకుండా రోజు రోజుకు తన అందాల ను చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. ఇక ఇదే విధంగా కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు కూడా ప్రయత్నిస్తోంది.
కోలీవుడ్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడ కూడా తన హవా కొనసాగించడానికి తెగ ట్రై చేస్తోంది. రష్మిక చేతిలో ఇప్పటికే తెలుగు సినిమాలు మూడు,తమిళ సినిమాలు రెండు,బాలీవుడ్లో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయట. ఇక తాజాగా మరో క్రేజీ తమిళ్ ప్రాజెక్టు లో కూడా రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరో గా రాబోతున్న ఈ సినిమాలో ముందుగా సాయి పల్లవి అనుకున్నారట.కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తీసేసి ఆమె స్థానం లో రష్మిక ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ధనుష్ తో కలిసి రష్మిక రొమాన్స్ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే కోలీవుడ్ లో కూడా తన బెర్త్ కన్ఫామ్ చేసుకోవడం ఖాయం అంటున్నారట సినీ జనాలు.అయితే ధనుష్ ఈ మధ్య నే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక ఇలాంటి టైమ్ లో రష్మిక ధనుష్ తో కలిసి రొమాన్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నార ట రష్మిక అభిమానులు. అంతే కాదు ఇలా చేస్తే రష్మిక కెరియర్ పై ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి