
ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడానికి పూర్తిగా కొరటాలే కారణమంటూ పరోక్షంగా చిరంజీవి ఎన్నోసార్లు మీడియా కు వెల్లడించారు.
ఇకపోతే కొరటాల సినిమా దర్శకత్వం విషయంలో మెగాస్టార్ ప్రమేయం కూడా ఉందని అందుకే సినిమా రిజల్ట్ ఇలా ఉందని మరో వాదన కూడా మనకు ఇండస్ట్రీలో ఉంది.ఇకపోతే ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్నోసార్లు ఈ సినిమా ఫ్లాప్ గురించి చిరంజీవి ప్రస్తావించడమే కాకుండా చరణ్ తాను ఇద్దరు కలిసి ఏకంగా 80% రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చామంటూ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు గట్టిగా వచ్చారు.
ఈ సినిమాతో అద్భుతమైన హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వర్షం కూడా రాబడుతోంది.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎటు తేల్చుకోలేకపోతున్నారు.ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు ఆయన . అయితే ఈ సినిమా కొరటాలకు నిజంగానే ఒక అగ్నిపరీక్ష లాగా ఉంది. ఈ సినిమా ఎలాగైనా హిట్ కొడితేనే కొరటాలకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని లేకపోతే ఈయన ఇండస్ట్రీలో కొనసాగడం కష్టతరమవుతుందంటూ పలువురు ఇలా భావిస్తున్నారు. మరి కొరటాల ఎన్టీఆర్ సినిమాతో హిట్టు కొడతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది