తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది.ఇక  అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.అయితే దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది.  అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు.అయితే  ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు.

ఇకపో  యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. అంతేకాదు వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.అయితే ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యువ హీరోలు చాలా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు.ఇక  గతంలో పాగల్ సినిమా ప్రమోషన్స్ సందర్భంలో విశ్వక్‌సేన్ రోడ్డు మీద చేసిన ఓ ప్రమోషన్ బాగా వైరల్ అవ్వడంతో దానిపై కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి.ఇక  దీంతో ఓ న్యూస్ ఛానల్ విశ్వక్‌సేన్ ని ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతూ మధ్యలో ఆ మాటలు గొడవగా మారడంతో యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్‌సేన్ ని స్టూడియో నుంచి వెళ్ళిపోమంది.

ఇకపోతే  విశ్వక్‌సేన్ ఏం మాట్లాడకుండా బయటకి వచ్చేశాడు.అంతేకాదు అప్పట్లో ఇది బాగా సంచలనంగా మారింది.ఇదిలావుంటే ఇక తాజాగా అన్‌స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్ దాని గురించి స్పందిస్తూ.. ”నాకు తెలిసి ఇటీవల నాకు జరిగిన పెద్ద అవమానం అంటే అదే సర్.... ఓ యాంకర్ టీవీ షోకి ఇంటర్వ్యూకి పిలిచి గొడవ పెట్టుకొని బయటకి వెళ్ళిపోమంది. ఇక అక్కడ నా తప్పేమి లేదు.అలాంటి వాళ్ళతో మాట్లాడటం కంటే వెళ్లిపోవడం బెటర్ అని సైలెంట్ గా లేచి వచ్చేశాను.అంతేకాదు  ఆ విషయంలో ప్రేక్షకులు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇక అప్పుడు నా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ మాత్రం మర్చిపోలేను” అని తెలిపాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: