
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి పాల్గొంది. ఇకపోతే తనది పెద్ద కటౌట్ కావడంతో.. తనని ఇబ్బంది పెట్టేవాళ్లని బయపెడుతుంటానని చెప్పింది. మిగతా వాళ్లలా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోనని, వెంటనే డోసు ఇచ్చేసి, క్లాస్ పీకుతానని క్లారిటీ ఇచ్చింది. రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేస్తానని చెప్పడంతో టీనేజ్ లో పెద్దగా సినిమాలు చేయలేకపోయాను. ఇక హీరోయిన్లకు తల్లిగా నటించేటప్పుడు.. అవి కాంప్లిమెంట్ కావాలి అని ప్రగతి చెప్పింది. ఎలా ఉన్నాసరే తాను అందగత్తెనే అని, తనకు సినిమాలొస్తాయని ప్రగతి ధీమాగా చెప్పింది. తనకు తాను అందంగా ఉన్నానని సర్టిఫికెట్ కూడా ఇచ్చేసుకుంది. వర్కౌట్స్ వల్ల తన అందం కాదు.. బలం, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పింది. ఇప్పటికీ క్యాట్ వాక్ చేస్తుంటానని తెలిపింది. కుడిచేతిపై ఓ మచ్చ ఏర్పడటంతో.. దాన్ని కవర్ చేసుకునేందుకు టాటూ వేయించుకున్నానని ప్రగతి చెప్పింది.