నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రస్తుతం ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన మొదటి సీజన్ సూపర్ హిట్ కాగా ఇక ఇటీవల రెండవ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ రెండవ సీజన్లో భాగంగా మొదటి ఎపిసోడ్ లోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్పెషల్ గెస్ట్ గా పిలిచి షోపై మరింత హైప్ పెంచేశాడు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న యువ హీరోలను తన షో కి పిలిచి ప్రేక్షకులకు తనదైన రీతిలోనే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 కాగా ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో రెండు ఎపిసోడ్లు పూర్తి కాగా.. మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో కాస్త అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక బాలయ్య షోకి యువ హీరోలు శర్వానంద్, అడవి శేష్ గెస్ట్ లుగా వచ్చారు. ఇక ఎప్పటి లాగానే బాలయ్య వీరిద్దరితో కలిసి సరదాగా మాట్లాడుతూ షో ని ఎంటర్టైనింగ్ గా ముందుకు నడిపించారు అని చెప్పాలి.  అయితే ఇంతకుముందు ఎన్నడూ బాలయ్య షోలో కనిపించని విధంగా ఇక ఇప్పుడు మాత్రం డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా కనిపించాయి అని చెప్పాలి.


 ఒకవైపు బాలకృష్ణ మరోవైపు హీరో శర్వానంద్ కూడా డబల్ మీనింగ్ డైలాగ్లతో అందరిని ఆశ్చర్యపరిచారు. ముందుగా బాలయ్య నీ ఫోన్లో ఎన్ని బిట్లు ఉన్నాయి అంటూ శర్వానంద్ ని ప్రశ్నించగా.. అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత శర్వానంద్ బాలయ్యను ఒక ప్రశ్న అడుగుతూ మీరు ఇప్పటివరకు వంద సినిమాలు చేశారు అందులో కనీసం 25, 30 మంది హీరోయిన్లతో అయినా చేసి ఉంటారు కదా అంటూ డబల్ మీనింగ్ డైలాగ్ వేశాడు శర్వానంద్. దీంతో సీరియస్గా చూసిన బాలయ్య ఇవన్నీ బి సెంటర్ వాడి తెలివితేటలు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నువ్వు నీ సినిమాలో హీరోయిన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అంటూ బాలయ్య శర్వానంద్ కు మరో డబల్ మీనింగ్ డైలాగ్ తో కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: