తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా యశోద. హరి హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నారు.గత కొంత కాలం నుంచి కూడా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఆమె ప్రమోషన్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ సినిమాలో సమంత తర్వాత ఆమెకి సమానంగా పాత్ర పోశించిన తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో కూడా ప్రమోషన్స్ చేయిస్తున్నారు. యశోద సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ కూడా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. హరి హరీష్ దర్శకులు ఇద్దరు తను చెన్నైలో ఉన్నప్పుడు ఈ కథ తనకు చెప్పారని..ఇక ఈ కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించిందని ఆయన అన్నారు.ఇక అంతేకాదు సినిమాని ముందు 3 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేద్దామని అనుకోగా సమంత ప్రాజెక్ట్ లోకి చేరాక దాదాపు 40 కోట్ల దాకా భారీ బడ్జెట్ అయ్యిందని అన్నారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు అంత బడ్జెట్ రిస్క్ ఏమో కదా అని అనుకున్నా కానీ సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టేశాం అంటున్నారు కృష్ణ ప్రసాద్.


అయితే సమంత వల్ల ఈ సినిమాకు చాలా హైప్ వచ్చిందని. ఆమె చాలా అద్భుతమైన యాక్టర్ అని.. సినిమాకు ఆమె చాలా సపోర్ట్ కూడా అందించారని చెప్పారు.. ఇక అంతేకాదు ఆమె అందరికి స్పూర్తి కలిగించిందని అన్నారు నిర్మాత కృష్ణ ప్రసాద్. అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు విషయానికి వస్తే మల్టీ ప్లెక్సీలలో 195 లేదా 200 ఉంటుందన్నారు. ఇంకా అలాగే నార్మల్ థియేటర్ లలో 150 ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.నవంబర్ 11న విడుదల అవుతున్న యశోద సినిమాపై దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సరోగసి నేపథ్యంతో తెరకెక్కిన యశోద సినిమా టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. ముఖ్యంగా సమంత యాక్షన్ సీన్స్ అయితే ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. సమంత ఇదివరకు చేసిన ఫీమేల్ సెంట్రిక్ సినిమాల తరహాలోనే ఈ యశోద సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: