సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసి కూడా చాలా రోజులవుతోంది. ఇటీవలే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో కథలో మార్పులు చేస్తున్నట్టు, కొత్త కథతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణ గారి మరణంతో మహేష్, కాలికి గాయంతో పూజా హెగ్డే గ్యాప్ తీసుకోవడంతో.. దొరికిన ఈ టైంని స్క్రిప్ట్ వర్క్ కోసం కేటాయించు కున్నారట త్రివిక్రమ్.

'అతడు'మరియు 'ఖలేజా' వచ్చిన 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఒకటీ రెండూ కాదు ముచ్చటగా మూడు క్రేజీ అండ్ సాలిడ్ అప్‌డేట్స్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలీలను సెకండ్ హీరోయిన్‌గా అయితే ఫిక్స్ చేశారట.

'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి', 'అ..ఆ', 'అరవింద సమేత', 'అల..వైకుంఠపురములో' సినిమాల మాదిరిగానే ఇందులో కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు అయితే సందడి చేయబోతున్నారు. అలాగే ఓ సీనియర్ హీరోయిన్ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతుందట. 'అత్తారింటికి', 'అ..ఆ' లో నదియా.. 'సన్నాఫ్ సత్యమూర్తి' లో స్నేహా, 'అజ్ఞాతవాసి' లో ఖుష్బూ, 'అల..వైకుంఠపురములో' లో టబు లానే మహేష్ మూవీలో ఓ క్రేజీ సీనియర్ భామని కూడా దింపబోతున్నారు.

ఇక ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఓ టాప్మరియు క్రేజీ అండ్ కిరాక్ హీరోయిన్‌తో సాలిడ్ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.SSMB 28కి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వీలైనంత వరకు డిసెంబర్‌లో లేదా సంక్రాంతి తర్వాత షూటింగ్ రీ స్టార్ట్ కానుందని కూడా అంటున్నారు. దర్శక నిర్మాతలు త్వరలో అధికారికంగా అన్ని వివరాలు అయితే తెలియజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: