తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "రంజితమే" అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ విడుదల అయిన నిమిషాల్లోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ ను సాధిస్తూ , ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ ను కూడా విడుదల చేయడానికి సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ నుండి రెండవ సాంగ్ ను డిసెంబర్ 4 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ష్ణు పాడినట్లు తెలుస్తుంది. అలాగే ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు సమాచారం. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: