అందాల భామ అయిన అనుపమా పరమేశ్వరన్‌ గ్లామర్‌ ఫోటోలతో ఆద్యంతం ఆకట్టుకుంటూ కుర్రాళ్ల హృదయాలను తెగ కొల్లగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ నెటిజన్ల మదిని అయితే దోచుకుంటుంది.

అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చిలిపి నవ్వులతో కూడిన ఫోటోలను షేర్‌ చేసింది. రెట్టింపు ఆనందంలో ఆమె కొంటె పోజులిచ్చింది. అదే సమయంలో తన హాట్‌ అందాలను కూడా ఆవిష్కరించింది అనుపమా పరమేశ్వరన్‌. నెట్టింట రచ్చ చేస్తుంది.

 
అనుపమా కర్లీ హెయిర్‌లో కొంటె నవ్వులతో ఆద్యంతం మంత్రముగ్దుల్ని చేస్తుంది. కుర్రాళ్లు హృదయాల్లో గిలిగింతలు పెడుతుంది. ఈ సందర్భంగా అనుపమా పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.`నా కళ్లని కనుగొనడానికి గూగుల్‌ చేస్తే.. అయ్యే మీరు దానిని నాల్గవ స్థానంలో కనుగొన్నారు` అని పేర్కొంది అనుపమా.

 
అయితే తాను ఐదు ఫోటోలను పంచుకోగా, అందులో నాల్గవ ఫోటోల్లో మాత్రం తన కళ్లని చూపించింది. మిగిలిన నాలుగు ఫోటోల్లో కళ్లు మూస్తూ కనిపించింది. కానీ నాల్గో ఫోటోల్లో తన అందమైన కళ్లని కూడా ఆవిష్కరించింది. కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది.

 
ఇక క్యూట్‌ అందాలతో ఆకట్టుకునే అనుపమా పరమేశ్వరన్‌ నిండైన అందానికి కేరాఫ్‌. కానీ ఆమె రాను రాను గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. తన సహజమైన అందాలను కూడా ఆవిష్కరిస్తుంది. హాట్‌ డోస్‌ పెంచుతూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. నెట్టింట హీటుని పెంచుతుంది. కమర్షియల్‌ మీటర్‌లోకి వెళ్తుంది అనుపమా.

 
మరోవైపు హీరోయిన్‌గానూ ఆమె దూసుకుపోతుంది. వరుస ఆఫర్లు, విజయాలతో దూకుడు పెంచింది. ఇటీవల ఆమె `కార్తికేయ 2`తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆమె కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. వరుస పరాజయాల నుంచి బిగ్‌ రిలీఫ్‌నిచ్చింది అనుపమా.

 
త్వరలో మరో రొమాంటిక్‌ మూవీతో ఆడియెన్స్ ముందుకి రాబోతుందట అనుపమా. ఆమె నటించిన `18పేజెస్‌` చిత్రం డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. కార్తికేయతో కలిసి మరోసారి ఆమె వెండితెరపై సందడి అయితే చేయబోతుంది. వీటితోపాటు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ` `డీజే టిల్లు` సీక్వెల్‌ `టిల్లు స్వ్కేర్‌`, `బట్టర్ ఫ్లై`, తమిళంలో `సిరెన్‌` చిత్రాలున్నాయి. అలాగే మలయాళంలో మరో సినిమా చేస్తుంది అనుపమా పరమేశ్వరన్‌. వీటితోపాటు రెజీనాతో కలిసి `మరీచిక ` అనే సినిమాలో కూడా నటిస్తుంది. గతేడాది ఆమె చేతిలో ఒక్క సినిమానే ఉండేది ఇప్పుడు అరడజను సినిమాలతో అయితే దూసుకెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: