యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ని దర్శకుడిగా పరిచయం చేస్తూ .. హీరో నాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ "హిట్: ది ఫస్ట్ కేస్".. ఈ సినిమా విడుదలయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకొని విశ్వక్ సేన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి మంచి గుర్తింపును అందించింది. దీనిని కొనసాగింపుగా రూపొందిన మరో మర్డర్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ "హిట్ 2: ది సెకండ్ కేస్".. మోస్ట్ టాలెంటెడ్ ప్రామిసింగ్ హీరో అడవి శేష్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. దీనికి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. అడవి శేష్ నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో శనివారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చిత్ర బృందం ప్రకటించింది. "అత్యంత కిరాతకంగా హత్యలు చేసే సైకో కిల్లర్ ని వెతుక్కుంటూ వెళ్లే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడవి శేష్" నటించిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డు "ఏ సర్టిఫికెట్" ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా రన్ టైం ని కూడా లాక్ చేసేసారు. యాక్షన్ మర్డర్ ట్రైలర్ గా తెరకెక్కుపోతున్న ఈ సినిమా రన్ టైం  రెండు గంటలకు కుదించారు.

మరొక విషయం ఏమిటంటే సెన్సార్ సమయంలో ఈ మూవీలోని మెయిన్ హైలెట్ గా నిలిచే కిల్లర్ క్యారెక్టర్ ని చూసిన సెన్సార్ వారు ట్విస్ట్ చూసి షాక్ అయ్యారట.  ఊహించని స్థాయిలో .. సినిమా రసవత్తర మలుపులతో ఊహకందని ట్విస్ట్ తో సాగుతుండడంతో దర్శకుడు టేకింగ్ కి ఫిదా ఇన్ సెన్సార్ వారు దర్శకుడు శైలేష్ ను ప్రత్యేకంగా అభినందించారని సమాచారం. ఈ సినిమాతో హీరో అడవి శేష్ ఏ హీరోకి సాధ్యం కానీ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: