ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన టాలెంట్ను బయటపెట్టి.. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు ఇండస్ట్రీకి రారాజుగా కొనసాగారు మెగాస్టార్ చిరంజీవి.  ఒకవైపు స్టార్ హీరోలు.. మరోవైపు స్టార్ హీరోల వారసుల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో ఇక తన టాలెంట్ తో అందరిని దాటేసి నెంబర్వన్ స్థానంలో కొనసాగారు అని చెప్పాలి. ఇప్పటివరకు హీరోగా 150 సినిమాలు లో నటించాడు అంటే ఇక చిరు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారో అర్థం చేసుకోవచ్చు.

 అయితే ఇలా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు తిరగరాయాలన్న.. ఇతర హీరోల రికార్డులను కొల్లగొట్టాలన్న అది చిరంజీవికే సాధ్యమవుతుంది అని చెప్పాలి. ఇక ఎంతోమంది యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తూన్నాడు చిరంజీవి. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు అని చెప్పాలి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిరంజీవి తన సినిమాలతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టగా.. కొన్ని రికార్డులను యువ హీరోలు బ్రేక్ చేశారు. కానీ ఇప్పటికీ ఏ హీరోకి సాధ్యం కానీ ఒక రికార్డు మాత్రం ఇంకా మెగాస్టార్ చిరంజీవి పేరిటే ఉంది అని తెలుస్తుంది. సాధారణంగా ఇప్పటివరకు చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టారు. కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లతో చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకొని రికార్డ్ సృష్టించారు.


 చిరంజీవి - నగ్మా  : చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమా ఘరానా మొగుడు. ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే నగ్మా ఇద్దరు చెల్లెళ్లతో  కూడా చిరంజీవి నటించారు.

 చిరంజీవి-  రోషిని : నగ్మా మొదటి చెల్లి అయిన రోషినితో చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు. అయితే ఇక రోషిని మాత్రం ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది అని చెప్పాలి.

 చిరంజీవి -  జ్యోతిక  : నగ్మా రెండవ చెల్లెలు అయిన జ్యోతిక తో చిరంజీవి ఠాగూర్ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు చిరంజీవి, జ్యోతిక జంట మంచి గుర్తింపు సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: