టాలీవుడ్ సినీ దర్శకులు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా సినిమాలు తీసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే బాహుబలి.. కే జి ఎఫ్.. కార్తికేయ 2.. నిన్నే విడుదలైన హిట్ 2.. సినిమాలు ఇలా సిరీస్ సినిమాలు అన్నీ విడుదలై సూపర్ డూపర్ హిట్ లు అందుకోవడం మనం చూసాం.. దీంతో దర్శకులు అందరు కూడా ఇప్పుడు ఇలాంటి సిరీస్ లు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు .అంతేకాదు త్వరలోనే టాలీవుడ్ లో పుష్ప 2.. ఆర్ ఆర్ ఆర్  సీక్వెల్ కూడా రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా.. అయితే ఇప్పుడు నిన్న విడుదలైన హిట్ 2 సినిమా

 2020లో వచ్చిన హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది .నూతన దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి టాక్ ను తెచ్చుకుంది. దాంతోపాటు అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది. అయితే ఈ సినిమాను ఏడు భాగాలుగా తీయాలని నాని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకదు త్వరలోనే హిట్ 3 సినిమాను కూడా మొదలు పెట్టనున్నారట చిత్రబృందం. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈ సినిమాలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఏడవ భాగంలో నాని హీరోగా కనిపించనున్నారని తెలుస్తుంది.  మిగిలిన భాగాలలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే చివరికి ఏడో భాగంలో వీళ్ళందరూ కలిసి ఒక అతిపెద్ద కేసును పరిష్కరిస్తారని తెలుస్తోంది. హిట్ ఫ్రాంచైజ్ రాబోయే రోజుల్లో అతిపెద్ద ఇండియన్ ప్లాన్ చేంజ్ గా ఉండబోతుందని టాక్ నడుస్తుంది .ఇందులో నిజం ఎంతుందో చూడాలి .కాగా ఈ ఏడు సినిమాలను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేచురల్ స్టార్ నాని ఆయన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్నాడట. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: