విజయ్ కి ఈమధ్య కాలంలో తెలుగులో కూడా క్రేజ్ పెరిగిపోతుంది. ‘తుపాకి’ సినిమా నుండి ‘బీస్ట్‌’ సినిమా వరకు ఈయన నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజవుతూ వస్తున్నాయి.తెలుగులో కూడా మంచి మార్కెట్ కోసం ఇక ఈ సారి నేరుగా తెలుగు సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి విజయ్ సిద్ధమయ్యాడు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ వారసుడు. తమిళంలో వారిసు పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ తో పూర్తి చేసుకోవడం జరిగింది. షూటింగ్ పూర్తి కావడంతో విజయ్ ఇక జూనియర్ ఆర్టిస్ట్ లతో ఇంకా అలాగే క్రూతో ఫోటోలు దిగడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా బృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఎంతగానో ఆసక్తిని పెంచుతున్నారు.తాజాగా మేకర్స్‌ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు.


ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ను డిసెంబర్‌ 4 వ తేదీన అనగా రేపు సాయంత్రం 4గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే సెకండ్‌ సింగిల్‌ కూడా ముందుగా తమిళంలోనే విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ‘రంజితమే’ పాట ప్రేక్షకులను చాలా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ పాటకు 78మిలియన్‌లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇటీవలే ఈ పాట తెలుగు వెర్షన్ కూడా రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది.మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు ఇంకా అతని తమ్ముడు శిరీష్‌, నిర్మిస్తున్నారు. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తుంది.ఎస్ ఎస్ థమన్‌  ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్‌ జరిగిందని సమాచారం తెలుస్తుంది. చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: