అసలు విడుదలకు ముందు ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన సినిమాల్లో 'హిట్' సినిమా కూడా ఒకటి. యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి సైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. కరోనా మహమ్మారికి ముందు రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించింది.అయితే పెద్దగా ఈ సినిమాకి వసూళ్లు ఏమి రాలేదు.అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ అయిన హిట్ 2 రిలీజైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడివిశేష్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 2న రిలీజై అన్ని ఏరియాల్లో కూడా పాజిటీవ్ టాక్‌ తెచ్చుకుంది. ఓపెనింగ్‌ డే నుండి బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా వసూళ్లతో ఫాస్ట్ గా దూసుకుపోతుంది. మొదటి పార్టుకు మించి సెకండ్‌ పార్టును సైలేష్‌ కొలను చాలా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించాడు. కాగా తాజాగా ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుంది.‘హిట్-2’ సినిమా ఫస్ట్‌ వీకెండ్‌ పూర్తయ్యేలోపు ఏకంగా రూ.28.1 కోట్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుంది.


ఈ సినిమాతో అడివిశేష్‌ దెబ్బకి డబుల్ హ్యట్రిక్‌ సాధించాడు. క్షణం, అమితుమి, గూఢాచారి, ఎవరు, మేజర్‌ వంటి సూపర్ హిట్‌ చిత్రాల తర్వాత హిట్‌-2 సినిమా కూడా చాలా మంచి విజయం సాధించడంతో అడివిశేష్‌ ఖాతాలో డబుల్‌ హ్యట్రిక్‌ రికార్డ్ చేరింది. ఇంకా ఈ మధ్య కాలంలో ఎన్‌టీఆర్‌ మాత్రమే ఈ ఫీట్‌ ని సాధించాడు. ఇక ఇప్పుడు అడివిశేష్ కూడా ఈ ఘనత సాధించడంతో శేష్ అభిమానులు ఎంతగానో ఖుషీ అవుతున్నారు.అసలు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్‌ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ సినిమాలో అడివిశేష్‌కు జోడీగా కిలాడి బ్యూటీ మీనాక్షీ చౌదరీ నటించింది. కోమలి ప్రసాద్‌ ఇంకా రావు రమేష్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని ఇంకా ప్రశాంత్ తిపిరినేని నిర్మించారు. ఇక మూడో పార్ట్‌లో నాని హీరోగా నటించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: