మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిరంజీవి ఈ సంవత్సరం , ఆచార్య గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

కాక పోతే ఈ మూవీ ని ఇన్ని రోజుల పాటు ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమాను ఏ రోజున విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన వాల్తేరు వీరయ్య మూవీ ని థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: