పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస  సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాను అనౌన్స్ చేయడంతో ఆయన అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. దీనికిగాను హరిహర వీరమల్లు సినిమాను త్వరగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం .అయితే ఇప్పటికే ఈ సినిమాను పూర్తి చేసి వేసవి కి విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకొని సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవర్ కళ్యాణ్. ఇక ఈ సినిమా కూడా తమిళ్ సినిమాకి రీమిక్స్ అన్నా సంగతి మన అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. గబ్బర్ సింగ్ కాంబో తర్వాత ఈ కాంబో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు .కానీ అది కాలేదు అయితే ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాలని భావించారని ఎన్నో నెలల నుండి పెండింగ్ లోనే

 ఈ సినిమా షూటింగ్ ఉంది అని ఈ నేపథ్యంలోని అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్లారిటీ వచ్చింది పవన్ తో హరీష్ సినిమా ఉంటుంది కానీ అది భవదీయుడు భగత్ సింగ్ కాదని తేలిపోయింది. అంతేకాదు తమిళంలో సూపర్ హిట్ అయిన తేదీ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానందట. ఇక ఇందులో నిజం ఎంతుందో తెలియాలి అంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: