సమంత మాట ఇప్పుడు ఎక్కువగా వినిపించలేదు..నాగ చైతన్య తో కలిసి ఉన్నంతకాలం సామ్ పేరు సినిమాల్లో మాత్రమే వినిపించేది..కానీ ఇప్పుడు మొన్నటివరకూ ప్రతి రోజు వార్తల్లో సామ్ పేరు వినిపిస్తోంది..విడాకుల వివాదంతో సామ్‌ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.పుష్ప లో స్పెషల్‌ సాంగ్‌తో మళ్లీ ఇండస్ట్రీకి రెట్టించిన ఉత్సాహంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక విడాకుల తర్వాత చెలరేగిన వివాదాలు, ట్రోలింగ్స్‌ అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న సమంత అంతలోనే తన హెల్త్‌కి సంబంధించి ఓ వార్త చెప్పి ఫ్యాన్స్‌ను షాక్‌కి గురి చేసింది. అరుదైన వ్యాధి మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.


ఇక ప్రస్తుతం ఓ వరుస లు చేస్తూ మరోవైపు వ్యాధితో పోరాటం చేస్తోంది సామ్‌.ఇదిలా ఉంటే లతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఓ నెటిజన్‌.. 'మేడమ్‌ జీ జీవితం ఎలా సాగుతోంది.?' అని ప్రశ్నించగా దానికి సామ్‌ బదులిస్తూ.. 'విభిన్నంగా ఉంది' అంటూ బదులిచ్చింది. దీంతో సామ్‌ చేసిన ఈ కామెంట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఒకవైపు విడాకులు, మరో వైపు వ్యాధితో ఆమె ఇబ్బంది పడుతుంది.సామ్‌ తన జీవితం మునపటి కంటే భిన్నంగా ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.ఇక మరో నెటిజన్‌.. 'మేడమ్‌ మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతిరోజూ కోరుకుంటున్నాను. మళ్లీ మీరు బాక్సాఫీస్‌ సక్సెస్‌లు అందుకోవాలి. అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి' అని అడగ్గా.. సామ్‌ మాట్లాడుతూ.. 'మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు' అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు..ఇప్పుడు శాకుంతలం సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఆసక్తి కనబరుస్తున్నారు ఫ్యాన్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: