బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఒక చిన్న సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు ఈ చిన్న సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ దర్శకుడితో సినిమా అని ఒక అఫీషియల్ ప్రకటన వచ్చినప్పుడే అదేంటి అంత చిన్న దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఒప్పుకున్నాడ అని అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక మరో ముగ్గురు హీరోయిన్లు కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. అంతేకాదు ఇక ప్రేక్షకుల ఊహకందని రీతిలో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు మారుతి ఒక ఆసక్తికర ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఎంతో స్టైల్ గా ఉన్న కాస్ట్లీ కారులో కూర్చున్న ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు మారుతి. ఇక ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఈ ఫోటో చూసిన తర్వాత మారుతి కూర్చున్న కారును ఎక్కడో చూసినట్లే ఉందే అనే కొంతమంది అనుకుంటున్నారు. ఇక మరి కొంతమంది అభిమానులు మాత్రం అది మన డార్లింగ్ లంబోర్గిని కారు అని గుర్తు పట్టేస్తున్నారు.. ఇండియాలోనే అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారును ప్రభాస్ కొనుగోలు చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు మారుతి ఆ కారులోనే షికారుకు వెళ్లి వచ్చి ఇదిగో ఇలా ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే స్పందిస్తున్న డార్లింగ్ అభిమానులు మీకు ఆ కార్ అస్సలు సెట్ అవ్వలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: