క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బన్నీ పుష్ప రాజు క్యారెక్టర్ లో రష్మిక మందన శ్రీవల్లి క్యారెక్టర్ లో అలాగే విరుద్ధరితోపాటు సమంతా ఒక ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి ఆర్టిస్టులకి ఈ సినిమాతో పాన్ ఇండియా గ్రేస్ లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ద్వారా పని ఇండియా క్రికెట్ సంపాదించుకున్న నటులలో సునీల్ కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఇక ఈ సినిమాలో సునీల్ మంగళం శ్రీను అనే ఒక విలన్ పాత్రను పోషించాడు. అప్పటివరకు బిగ్గెస్ట్ కమెడియన్ గా ఉన్న ఈయన ఒకసారి  విలన్ రోడ్లో కనిపించడంతో ప్రేక్షకులంతా విలన్ పాత్రలో సునీల్ ఎలా కనిపిస్తాడు అని చూడడానికి చాలా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమాలో సునీల్ మంగళం శ్రీను క్యారెక్టర్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ వీటన్నిటితోపాటు ఆయన మేక్ ఓవర్ ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. చాలా రోజుల తర్వాత సునీల్ ని ఒక కొత్త గెటప్ లో కనిపించాడు పుష్ప సినిమాలో విలన్ గా నటించిన పుణ్యమా అని బిగ్గెస్ట్ విలన్ గా మంచి గుర్తింపు దక్కింది. దీంతో పాటు పలు పెద్ద సినిమాల్లో కూడా ప్రస్తుతం సునీల్ కి అవకాశాలు వస్తున్నాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో తనకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన మంగళం శీను క్యారెక్టర్ మరియు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి కూడా పలు విషయాలను గురించి పంచుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో సుకుమార్ సునీల్ కి ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి గల కారణాన్ని కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. మొదటి నుండి సుకుమార్కి నాకు మంచి బాండింగ్ ఉంది.. పుష్ప సినిమాలో క్యారెక్టర్ ఇవ్వమని నేనే అడిగాను..దింతో  సుకుమార్..నువ్వు ఆల్రెడీ బాడీని అన్ని విధాలుగా వాడే అన్ని క్యారెక్టర్స్ చేశావ్.. అందుకే ఈసారి ఏదైనా కొత్తగా చేద్దాం.. అని మంగళం శ్రీను క్యారెక్టర్ నాకు ఇచ్చాడు.. అప్పుడు లాక్ డౌన్ సమయం కావడంతో ఇంట్లో ఉండి క్యారెక్టర్ స్కెచ్ పంపించారు.. వారు చెప్పిన విధంగా నేను రెడీ అయ్యాను. చూసినా అనంతరం అందరూ ఓకే చేశారు అంటూ చెప్పుకొచ్చాడు సునీల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: