టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటి సురేఖ వాణి గూర్చి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి నెట్టింట్లో లో చేసే హంగామా అంతా ఇంతా కాదు.తల్లీకూతుళ్లు ఇద్దరూ కూడా డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటారు.

ఐతే కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత బాగా ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. లేటెస్ట్గా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐతే ఘన విజయం సాధించిన రవితేజ ధమాకా చిత్రంలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో యూట్యూబ్ లో జనాలు ఎగబడి చూసిన 'పల్సర్ బైక్' కూడా పెట్టారు. రవితేజ, శ్రీలీల స్టెప్పులకు థియేటర్లు మోతెక్కాయి. ఆ సాంగ్ కి సుప్రీత తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ వీడియో పెట్టింది. హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే సుప్రీతా ఈ వీడియోలో మాత్రం డిఫెరెంట్ గా కనిపించింది. ఆమె పొట్ట బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది.

దాంతో నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. పొట్ట ఎక్కువగా కనిపిస్తోందని ముందే అర్థం అయిందో ఏమో కానీ సుప్రీతా వివరణ ఇస్తూ బోల్డ్ కామెంట్ చేసింది. ఏకంగా ఇన్నర్ వేర్ వేసుకోవడం మరచిపోయానని అంటోంది. ఆమె పొట్ట పెరగడానికి లోదుస్తులకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? సాధారణంగా సెలెబ్రిటీలు అందరూ నాజూగ్గా ఉండరు. వారి ఆహారపు అలవాట్ల వల్ల లావు పెరగడం, పొట్ట ఎక్కువగా కావడం జరుగుతుంది.

దీనికి కవర్ చేయడానికి ఫిట్ గా, నాజూగ్గా ఉన్నట్లు కనిపించడానికి టమ్మీ టక్కర్ అనే ఇన్నర్ వేర్ వేసుకుంటారు. ఇది పొట్టని నొక్కి ఉంచి ఫిట్ గా ఉన్నట్లు చూపిస్తుంది. సుప్రీతా ఇదే విషయం తెలియజేస్తూ ' టమ్మీ టక్కర్ ' వేసుకోవడం మరచిపోయా అంటూ ఫన్నీగా బోల్డ్ కామెంట్స్ చేసింది. దీనితో నెటిజన్లు ఆమెపై అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: