ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారినపడి సినిమా షూటింగ్స్ కి కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ బిజీగా మారుతుంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన సిడాటిల్ షూటింగ్లో సమంత జాయిన్ అయింది. ఇటీవల అ మూవీ షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఖుషి మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఇక సమంత లేటెస్ట్ శకుంతలం అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మైథాలజికల్ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషించగా మలయాళ నటుడు దేవి మోహన్ దృశ్యంతుడిగా నటించారు. 

ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో గుణశేఖర్ దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమాని మూవీ టీం కలిసి వీక్షించారు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా చూసిన అనంతరం సమంతా పోస్ట్ చేస్తూ ఫైనల్లీ ఈరోజు శాకుంతలం సినిమా చూశాను.. చాలా అందంగా ఉంది ఈ సినిమా ఒక దృశ్య కావ్యం ఎంతో బలమైన భావద్వేగాలతో రూపొందిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావ వేదాలు చూసి కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను.. ఇటువంటి సినిమా ఇచ్చిన దిల్ రాజు నీలిమ గుణలకు థాంక్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత..

ఇక శకుంతలం సినిమా చూసిన సమంత రివ్యూ కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది .అంతేకాదు సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటల కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలైన మల్లికా మల్లికా... ఏలేలో ఏలేలో.. ఋషి వనములోన..వంటి పాటలకు మంచి స్పందన లభించింది. దిల్ రాజు సమర్పణలో సినిమా నిర్మించారు .కాగా ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ ఈ సినిమాతోనే వెండితెరకు బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రను పోషించింది. సీనియర్ హీరో మోహన్ బాబు కూడా ఈ సినిమాలో దుర్వాస మహర్షిగా నటించాడు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేయాలనుకున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సమంతకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: