తెలుగు చిత్ర పరిశ్రమలోకి చలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. మొదటి సినిమాలో యువ హీరో నాగశౌర్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక మొదటి సినిమానే విజయం సాధించడంతో ఈ అమ్మడి కెరీర్ కి బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి రష్మిక పై పడింది. ఇంకేముంది ఇక అంతలోనే మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.


 ఇక మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు కూడా సూపర్ హిట్ సాధించడంతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక. అంతేకాదు నేషనల్ క్రష్ అంటూ ఒక అరుదైన బిరుదును కూడా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం రష్మిక ఎక్కడ కనిపించినా కూడా తన చలాకీతనంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూనే ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలే కాదు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. తాను మనుషులందరినీ ఒకేలాగా చూస్తానని.. అందరికీ గౌరవం ఇస్తాను అంటూ రష్మిక చెప్పింది. తన కుటుంబంలో పెద్దవాళ్లతో పాటు ఇంట్లో పని వాళ్ళ కాళ్ళకు కూడా నమస్కారం చేస్తాను అంటూ షాకింగ్ విషయాలను చెప్పింది.  ఒక మనిషిని బాధ పెట్టాలన్న బంధం పెంచుకోవాలన్న అది మనం మాట్లాడే విధానం పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు చెప్పింది వింటాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: