హాలీవుడ్‌లో భారీ విజయాలు అందుకొన్న సిరీస్ లలో జాన్ విక్ సిరీస్‌ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ కు సంబంధించిన నాలుగో ఫ్రాంచైజీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జాన్ విక్: చాఫ్టర్ 4 చిత్రం ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ ని అందుకుంటున్నది.జాన్ విక్ సిరీస్‌లో గత మూడు సినిమాలకు కూడా జనాల నుంచి చాలా మంచి రెస్సాన్స్ రావడంతో జాన్ విక్ 4 సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. చాడ్ స్టాహెల్‌స్కీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 వేల థియేటర్లలో విడుదల చేశారు.ఇక జాన్ విక్ 4 సినిమాకి సంబంధించిన గత 5 రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. ఇండియాలో మొదటి రోజు ఈ సినిమా 3 కోట్లు, రెండో రోజు 7 కోట్లు, మూడో రోజు 9 కోట్లు, నాలుగో రోజు 9 కోట్లు, ఐదో రోజు 10 కోట్లు వసూలు చేసింది.


దాంతో ఈ సినిమా 38 కోట్ల వసూళ్లను సాధించింది. గత రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఆడుతుంది.ఇక ప్రపంచవ్యాప్తంగా జాన్ విక్ 4 సినిమా కలెక్షన్ల వివరాల విషయానికి వస్తే.. శుక్రవారం 29.4 మిలియన్ డాలర్లు, శనివారం 25.8 మిలియన్ డాలర్లు, ఆదివారం 18.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి వారాంతంలో సుమారు 74 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది. ఇక సోమవారంతో కలుపుకోని ఈ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయల పైన వసూలు చేసింది. నేటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.ఇక జాన్ విక్ ప్రీక్వెల్ 2024 వ సంవత్సరం సమ్మర్ లో విడుదల అవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇది కూడా ఖచ్చితంగా అదరగొట్టేస్తుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: