మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఒకప్పుడు ఈ సినిమా డిజాస్టర్ అని తెలియజేసిన ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం ఈ సినిమాని హిట్టుగా చేయడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. రీ రిలీజ్ అయిన మూడవ రోజు కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొత్తంగా మూడు రోజుల్లోనే ఆరెంజ్ సినిమా ఎంతటి కలెక్షన్లు అందుకుందనే విషయం తెలుసుకుందాం.


2010లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఆరెంజ్ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని చిత్ర బృందం అనుకున్నారు.ఎందుకంటే అప్పటివరకు డైరెక్టర్ భాస్కర్ బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు. రామ్ చరణ్ కూడా మగధీర సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది.. నిర్మాతగా నాగబాబు కొనిదెల ప్రొడక్షన్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆరెంజ్ సినిమా అప్పట్లో చాలా గ్రాండ్గా విడుదల అయింది. విడుదలైన మొదటి రోజు ఊహించని విధంగా నెగటివ్ టాకు రావడంతో ఈ సినిమా దారుణమైన నష్టాలను చవిచూసింది.. హీరోయిన్గా జెనీలియా కూడా నటించింది. ఈ సినిమాతో నాగబాబు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఈ సినిమా మళ్లీ ఇంత కాలానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు అయితే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా. రూ.1.17 కోట్ల రూపాయలను క్రాస్ చేసినట్లు సమాచారం ఇక సీడెడ్ల రూ .15 లక్షలు ఆంధ్రప్రదేశ్లో 61 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కోటిన్నరకు పైగా క్రాస్ వసులు చేసింది ఈ చిత్రం. అలాగే కర్ణాటకలో 11 లక్షలు మిగతా రాష్ట్రాలలో ప్రదర్శించగా లక్ష రూపాయలు క్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది..దాదాపుగా రూ .2 కోట్లకు రూపాయలకు పైగా క్రాస్ వసూలు వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: