
ఒక పల్లెటూరులో జీవించే మహిళగా కీర్తి సురేష్ ఈ సినిమాలో కనిపించబోతుంది అన్నది ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. ఇక మరోసారి నటిగా కీర్తి సురేష్ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ముందుగా కీర్తి సురేష్ను అనుకోలేదట. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. హీరో నాని కీర్తి సురేష్ పేరు సూచించడంతో ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కీర్తి సురేష్ ని సంప్రదించాడట.
అయితే మొదట కథ వినిపించిన తర్వాత అటు కీర్తి సురేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అంటూ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చాడు. కీర్తి కి మొదట కథ చెప్పినప్పుడు ఎక్కడ ఒకే చెప్తారు అని భయపడ్డ.. స్టోరీ అర్థం కాలేదని ఆమె రిజెక్ట్ చేశారు. కానీ మళ్ళీ ట్రాన్స్ లేటర్ సహాయంతో కథ విని ఓకే చేశారు. ఇక తొలి రోజు షూటింగ్లో పేడ కలిపే షాట్ కు ఆమె ఓకే చెప్పగానే ఎంతగానో ఉత్సాహం వచ్చింది అంటూ శ్రీకాంత్ ఓదెలా చెప్పుకొచ్చాడు. దసరా సినిమాలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు..