పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లను ఓకే చేస్తూ వెళ్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా హరిహర వీరమల్లు మూవీ చిత్రకరణ దశలో ఉండగానే పవన్ కళ్యాణ్ తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న మూవీ షూటింగ్ ను ఇప్పటికే స్టార్ట్ చేసి ఆ మూవీ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు.

ఇలా ఇప్పటికే వినోదయ సీతం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న పవన్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం ను అందించబోతున్నాడు. మైత్రి సంస్థ ఈ మూవీ ని నిర్మించనుంది. ఈ మూవీ కోసం పవన్ 90 రోజుల వరకు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం.

మూవీ తో పాటు పవన్ ... సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో కూడా హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ ని v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ నెల చివరన ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మూవీ షూటింగ్ లో మే మొదటి వారంలో జాయిన్ కాబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: