
ఇప్పటికీ పవన్ డేట్స్ కోసం అటు డైరెక్టర్లు నెలల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని బట్టి ఇక పవన్ క్రేజ్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఏ హీరో కైనా అభిమానులు ఉంటారు. కానీ పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు అని చెప్పాలి. సినిమాలు చేసిన చేయకపోయినా.. చేసిన సినిమాలు హిట్ అయిన కాకపోయినా కూడా పవన్ ని ఆరాధిస్తూనే ఉంటారు. పవన్ సినిమాలను చూసి అభిమానులుగా మారిన వారి కంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఫ్యాన్స్ గా మారిన వారు ఎక్కువమంది.
కాగా పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు మూడో భార్య అన్నా లెజ్నోవా సాఫీగా దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్నారు. అంతకుముందు నందిని, రేణు దేశాయ్ లాంటి ఇద్దరిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి ఇక రష్యా దేశస్తురాలైన అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించి ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజ్నోవా, పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కలిశారట. అప్పుడే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారట. ఇక తర్వాత రేణు దేశాయ్ కు 2013లో విడాకులు ఇచ్చిన పవన్ అన్నా లెజ్నోవాతో ఏడడుగులు వేశారు. ఇక రష్యా సాంప్రదాయాలను మర్చిపోయి పవన్ భార్యగా మారిన తర్వాత భారతీయ మహిళగా మారింది అన్నా లెజ్నోవా. వీరి మధ్య ప్రేమ చిగురించడానికి ఒక పెద్ద కారణమే ఉందట.. పవన్ కళ్యాణ్ ఎలాగ అయితే దానధర్మాలు చేస్తారో ఇక అన్నా లెజ్నోవా కూడా అలాగే దానధర్మాలు చేస్తూ గొప్ప మనసు కలిగి ఉన్నారట. అందుకే ఇక వీరిద్దరి మనుషులు కలిసాయని వీరికి దగ్గరగా ఉండే స్నేహితులు చెబుతూ ఉంటారు. ఇక పవన్ మాదిరిగానే అన్నా లెజ్నోవా కూడా సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారట.