ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది. అయితే ఈ సినిమాతోపాటు పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడట. కానీ పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన పవన్ క్రియేటివ్ బ్యానర్స్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయబోతున్నాడట. ఇక పవన్ కి అత్యంత సన్నిహితుడైన ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
గతంలో పవన్ కళ్యాణ్ ను డైరెక్షన్ చేసిన ఒక డైరెక్టర్ ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి హిట్టు కొట్టిన యంగ్ డైరెక్టర్ ఇక పవన్ నిర్మాణంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల విరుపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సాయిధరమ్ తేజ్ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరులో మరో రెండు ప్రాజెక్టులు కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఒకటే పవన్ నిర్మాణంలో ఉండబోతున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి