ఇప్పుడు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ మహేష్ బాబు ప్రస్తుతం స్పెయిన్ లో తన ఇద్దరి వ్యక్తిగత సహాయకులను తన దగ్గర ఉంచుకుని ఒక డిఫరెంట్ కోర్సును చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అని తెలుస్తోంది పూర్తిగా ఫిట్నెస్ ప్రోగ్రామ్ కాదు. అన్ని రకాల అంశాలు ఈ ప్రోగ్రామ్ లో ఉంటాయి కాబట్టి మహేష్ ఈ కోర్స్ ను ఎంచుకున్నట్లు టాక్.
కేవలం ఫిజికల్ గా ఫిట్ గా ఉండడంతో పాటు బాడీ స్ట్రెంగ్త్ ను కూడ ఈ ప్రోగ్రామ్ పెంపొందిస్తుంది అని అంటున్నారు. త్వరలో రాజమౌళితో చేయబోతున్న సినిమా విషయంలో మహేష్ ఫిజికల్ గా కాకుండా అన్ని విషయాలలోనూ పూర్తిగా ఫిట్ గా ఉండాలి కాబట్టి మహేష్ ఈ కోర్సును ఎంచుకుని స్పెయిన్ లో ప్రశాంతమైన వాతావరణంలో కాలాన్ని గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ కోర్సు పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వచ్చిన తరువాత మే నెలాఖరు నుండి మళ్ళీ షూటింగ్ లో అడుగుపెడతాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీ షూట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళి సినిమా కోసం మానసికంగా సిద్ధపడాలని మహేష్ ఆలోచనలు చేస్తున్నాడు అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి