

మా అబ్బాయి అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ చిత్ర శుక్లా.. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి రంగులరాట్నం, అల్లరి నరేష్ తో కలిసి సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం వంటి పలు చిత్రాల లో నటించి మెప్పించిన ఈమె తాజాగా గీత సాక్షిగా అనే సినిమా లో కూడా నటించింది. ఇకపోతే తాజాగా తాను ప్రేమలో పడినట్లు ఒక వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ ఆఫీసర్ తో చిత్రా గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోందని సమాచారం.
అయితే ఇటీవల ఆమె బర్తడే సందర్భంగా వైభవ్ షేర్ చేసిన పోస్ట్ ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరేలా చేస్తోంది.. పైగా వైభవ్ చిత్ర శుక్లాకు హ్యాపీ బర్తడే మై స్వీట్ హార్ట్ అంటూ పోస్ట్ చేయడం.. దానికి చిత్ర థాంక్యూ నా వైభవ్ అంటూ కామెంట్ చేయడంతో ఇక వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మరో టాలీవుడ్ హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని చెప్పవచ్చు.