తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు సుకుమార్. క్లాస్ సినిమాలు తీయాలన్నా మాస్ సినిమాలు తీయాలన్నా.. తనకు సాటి ఇంకెవరూ లేరేమో అని ఎంతగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతే కాదు తన సినిమాల్లో క్యాలిక్యులేషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తూ ఉంటాడు. అందుకే ఇక సినీ ప్రేక్షకులు అందరూ కూడా సుకుమార్ ని లెక్కల మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమా చేశాడు సుకుమార్. అయితే ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా మారిపోయాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు సుకుమార్. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఏడాదిలోపే పుష్ప 2 షూటింగ్ పూర్తి చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఒక టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సుకుమార్ కు ఫ్లాప్ అని అన్నవారితోనే హిట్ అనిపించుకోవడం బాగా అలవాటు.


 అందుకే అల్లు అర్జున్తో ఆర్య 2 తీసి ఫ్లాప్ అనిపించుకున్నాడు. కానీ అదే బన్నితో పుష్ప తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో కూడా ఇలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వన్ నేనొక్కడినే సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో మహేష్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని సుకుమార్ ప్లాన్ చేశాడట. పుష్ప సినిమాకు ముందే వీరి కాంబినేషన్ రిపీట్ చేయాలని అనుకున్నప్పటికీ.. అది కుదరలేదు. కానీ ఇప్పుడు మహేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నాడట సుకుమార్. త్రివిక్రమ్ రాజమౌళి సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: