
త్వరలోనే ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ రెండవ పాట విడుదల కోసం ఒక ప్లాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవుతే ఈ సినిమా కన్న ముందే పాట హైలైట్ గా అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఏం చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్లు జాతీయ న్యూస్ చానల్స్, యూట్యూబ్, మ్యూజిక్ స్త్రీమ్మింగ్, థియేటర్లు ,సోషల్ మీడియా ఇతర వాటిని కూడా.. ఈ పాటను ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రేక్షకులలోకి చాలా తొందరగా ఈ పాట తీసుకువెళ్లాలని ఉద్దేశంతో చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ పాట రామ్ సియా రామ్ అంటూ సాగుతుందట మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. భారీ మొత్తం ప్లాన్ చేసి విడుదల చేస్తున్న ఈ పాట ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ పాట తెలుగు తమిళ్ ,కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో కూడా విడుదల చేయడం జరుగుతోంది. ఆదిపురు సినిమా పైన భారీగా అంచనాలు పెంచేస్తున్నారు డైరెక్టర్ ఓం రౌత్. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు