ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సహజసిద్ధమైన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమాలను తనదైన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా వరుస సినిమాలను చేస్తూ కొనసాగుతున్నాడు నాని. ఈ క్రమంలోనే ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్టును అనుకున్నా డు. దేశవ్యాప్తంగా ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత నాణ్యతను 30వ సినిమా కూడా ప్రకటించాడు. 

శౌర్యవ్ అనే దర్శకులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాని. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21 నాలుగు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట చిత్ర బృందం. ఈ సినిమా పూర్తిగా నాని తన 31వ సినిమా కూడా మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా ఒక మలయాళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ నాని

త్వరలోనే దృశ్యం సిరీస్ దర్శకుడు జీతూ జోసెఫ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కథకి సంబంధించిన చర్చలను కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సమయంలో సదరు డైరెక్టర్ చెప్పిన సినిమా పాయింట్ నానికి చాలా నచ్చిందట. దీంతో జీతో పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసిన తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఆ సినిమా ఒక బడా నిర్మాణ సంస్థతో కలిసి దానిని స్వయంగా నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇక ఈ సినిమాని కూడా దసరా సినిమాలాగే పాన్ ఇండియా లెవెల్లో తీసే ఆలోచనలో ఉన్నరట. ఇక ఈ సినిమా కోసం త్రిల్లర్ స్టోరీని రెడీ చేయబోతున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: