మన టాలీవుడ్ లో ఆరోజుల్లో కామెడీ హీరో ఎవరు అంటే కళ్ళుమూసుకొని టక్కుమని మనమంతా చెప్పే పేరు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత నేటి తరం లో కామెడీ హీరో ఎవరు అంటే మనకి గుర్తుకు వచ్చే పేరు అల్లరి నరేష్ .ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన ప్రముఖ నటుడు చలపతి రావు కొడుకు రవిబాబు దర్శకత్వం లో తెరకెక్కిన 'అల్లరి' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో, ఆ చిత్రం పేరే అల్లరి నరేష్ ఇంటి పేరుగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయనకీ అవకాశాలు వెల్లువలాగా వచ్చాయి. అయితే ఎక్కువగా ఆయనకీ కామెడీ సినిమాలు చేసే అవకాశమే వచ్చింది. అప్పుడప్పుడు తనలోని విలక్షణమైన నటుడిని తప్పి లేపుతూ కొన్ని అద్భుతమైన పాత్రలు పోషించాడు, వాటిల్లో 'గాలి శీను' అనే పాత్ర కూడా ఒకరు ఉంది.

జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్ ) తెరకెక్కించిన 'గమ్యం' సినిమాలో అల్లరి నరేష్ పోషించిన 'గాలిశీను' అనే పాత్ర అప్పట్లో ఒక సంచలనం. ఆ పాత్రని చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు అంటూ ఎవరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పాత్ర పోషించినందుకు గాను అల్లరి నరేష్ కి ఉత్తమ నటుడిగా నంది అవార్డు మరియు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది.ఇప్పటీకీ అల్లరి నరేష్ పోషించిన క్యారెక్టర్స్ లో టాప్ 1 పాత్ర ఏమిటంటే అందరూ 'గాలి శీను' పాత్ర పేరే చెప్తారు. ఇందులో ఆ పాత్ర చనిపోయే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా అల్లరి నరేష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ పాత్రకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. దిరేటర్ క్రిష్ ఈ సినిమాలో అల్లరి నరేష్ చనిపోయే సన్నివేశాన్ని అల్లరి నరేష్ పుట్టినరోజు నాడే చిత్రీకరించారట. ఇంకా ఆయన వివరిస్తూ ' ఈ సన్నివేశం ప్లాన్ చేసిన రోజు నా పుట్టినరోజు. ఈ విషయం డైరెక్టర్ క్రిష్ గారికి తెలియదు. ఆ తర్వాత నేను షూటింగ్ స్పాట్ కి వచ్చిన తర్వాత శర్వానంద్ ద్వారా ఆయనకీ తెలిసింది. అప్పుడు ఆయన అయ్యో అయితే ఈరోజు ఈ సన్నివేశం ఆపేద్దాం, రేపు చేద్దాం అన్నాడు. కానీ నేను వద్దు సార్, ఈరోజే చేద్దాం అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానివ్వండి అని చెప్పాను, ఆరోజు అలా నా పుట్టినరోజు నాడు తీసిన సన్నివేశం, ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఐకానిక్ సన్నివేశం గా నిలిచిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా కామెడీ సినిమాలే చేస్తూ వచ్చాడు, మద్యమద్యలో కొన్ని సీరియస్ పాత్రలు చేసాడు. ఇప్పుడైతే ఆయన కామెడీ సినిమాలను పూర్తిగా పక్కకి నెట్టేసి, సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: