చిత్ర పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో కు కోట్ల సంఖ్యలో అభిమానులు అయితే ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు వున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు తెగ చిరాకు తెప్పిస్తున్నారు. అప్ డేట్స్, అప్ డేట్స్ అంటూ టార్చర్ చేయడంతో అమిగోస్ మూవీ ఈవెంట్ లో ఫ్యాన్స్ పై ఎన్టీఆర్ ఒకింత సీరియస్ అయ్యారనే విషయం తెలిసిందే.

ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ వెళ్లగా అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయటా.. ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ కు వస్తాడని తెలిసిన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారటా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. ఎన్టీఆర్ తాతను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నా ఆయన ఫీలింగ్స్ ను ఫ్యాన్స్ ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు.

ప్రశాంతంగా ఎన్టీఆర్ దండం పెట్టుకోలేని పరిస్థితిని కల్పించారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారటా.. అభిమానుల వల్ల ఎన్టీఆర్ కు ఎలాంటి నష్టం లేదు. అయితే ఎన్టీఆర్ మనోభావాల ను పట్టించుకోకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అతి చేసే అభిమానులు ఈ విషయాల ను గుర్తుంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.

సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ సమయం, సందర్భం లేకుండా కామెంట్లు చేయడం కూడా సరి కాదు. ఈ విషయంలో మారాల్సింది అభిమానులేననే విషయం తెలిసిందే. అభిమానం అంటే తమ ఫేవరెట్ హీరోను ఇబ్బంది పెట్టకపోవడం అని కూడా అభిమానులు గుర్తుంచుకుంటే మంచిది. ఎన్టీఆర్ కెరీర్ పరం గా వరుస ప్రాజెక్ట్ ల తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకు పారితోషికాన్ని పెంచుకుంటున్న ఎన్టీఆర్ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాల కు ఓకే చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్ పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: